దరువు చిత్రం షూటింగ్ కోసం తార్నాకలోని ఒక ఆసుపత్రికి వచ్చిన రవితేజ ని చుట్టుముట్టారు తెలంగాణావాదులు.
తెలంగాణాకి అనుకూలంగా నినాదాలు చేయమని చిత్ర యూనిట్ ని బలవంతం చేయగా, వారికో షాక్ తగిలింది.
ఈ చిత్ర కథానాయకుడు రవితేజ, వారికి నో చెప్పి బయటికి పొమ్మన్నాడు.
దానితో అవాక్కయిన OU-JAC విద్యార్ధులు, ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం చేసారు.
గత సంవత్సరం రవితేజ హయత్‌నగర్ వద్ద నిప్పు చిత్రం షూటింగ్ లో ఉండగా, ఇలాగే కొందరు వచ్చి, సకల జనుల సమ్మె కి మద్దతుగా షూటింగ్ ఆపమని, తెలంగాణాకి అనుకూలంగా నినాదాలు చేయించి పంపారు.
అప్పుడు తలొగ్గిన రవితేజ, ఇప్పుడు తిరగబడడం వారికి రుచించినట్లు లేదు.
నిప్పు చిత్రం లో రవితేజ ‘ నేను తెలంగాణావాడిని, ఆంధ్రావాడిని, రాయలసీమవాడిని కాను.. అందరికీ కావలసిన హైదరబాద్ వాడిని ‘ అని డైలాగ్ కొట్టడంతో, ఆ చిత్ర ప్రదర్శన ఆపాలని అనుకున్న తెలంగాణావాదులు, అది కాస్తా ఫ్లాప్ అవ్వడంతో, పబ్లిసిటీ రాదని ఆగిపోయారు.
అయినా, తెలంగాణా సెంటిమెంట్ పేరుతో, చిత్రాలని నిర్మించి బాగుపడ్డ దిక్కులేని దర్శకులని, వ్యాపారస్తుల వద్ద డబ్బు గుంజిన రాజకీయ గూండాలని, టివీలో కనపడి పాపులర్ అవ్వడం కోసం బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగే ముసలి నాయకులని నిలదీసే దమ్ము లేని ఈ నిత్యవిద్యార్ధులు, అసలే ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న ఒక హీరో చేత జై కొట్టించినంత మాత్రాన, తెలంగాణాకి ప్రయోజనం ఏంటో వారికే తెలియాలి.
మైక్ చేతికి రాగానే పూనకం వచ్చినట్లు అందరినీ తిట్టి, పార్లమెంట్ కి వెళ్ళకుండా, ప్రజాస్వామ్య పద్దతులని వదిలి, హోమగుండంలోంచి తెలంగాణాని వెలికి తీస్తా అనే నాయకుడిని మాత్రం అడిగేవారే లేరు.


